1 దినవృత్తాంతములు 2

1రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను, 2దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు మరియు ఆషేరు అనేవారు ఇశ్రాయేలు కుమారులు. 3ఏరు, ఓనాను, షేలా అనేవారు యూదా కుమారులు. వీరి తల్లి పేరు బత్ షూయ. ఈమె కనానీయురాలు. యూదా పెద్ద కుమారుడు ఏరు దుష్టుడైనట్లు యెహోవా గమనించాడు. అందువల్ల ఆయన అతనిని చంపివేశాడు. 4యూదా కోడలు తామారుకు అతని వల్లనే పెరెసు, జెరహు అను కవల కుమారులు కలిగారు. ఆ విధంగా యూదాకు ఐదుగురు కుమారులయ్యారు. 5పెరెసు కుమారులు హెస్రోను, హామూలు. 6జెరహు సంతానం ఐదుగురు: జిమ్రీ, ఏతాను, హేమాను, కల్కోలు, దార్ద. 7జిమ్రీ కుమారుడు కర్మీ. కర్మీ కుమారుడు ఆకాను. ఇతడు ఇశ్రాయేలు వారికి అనేక కష్టాలు తెచ్చాడు. ఇతడు యుద్ధంలో తీసుకున్న వస్తువులను దేవునికివ్వకుండా తన వద్దనే వుంచుకొన్నాడు. 8ఏతాను కుమారుడు అజర్యా. 9హెస్రోను కుమారులు యెరహ్మయేలు, రాము, కెలూబై. 10రాము కుమారుడు అమ్మీనాదాబు. అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. నయస్సోను యూదా ప్రజల నాయకుడు. 11నయస్సోను కుమారుడు శల్మా. శల్మా కుమారుడు బోయజు. 12బోయజు కుమారుడు ఓబెదు. ఓబెదు కుమారుడు యెష్షయి. 13యెష్షయి పెద్ద కుమారుడు ఏలీయాబు. యెష్షయి రెండవ కుమారుడు అబీనాదాబు. అతని మూడవ కుమారుడు షమ్మాను (షిమియ). 14నెతనేలు యెష్షయికి నాల్గవ కుమారుడు. అతని ఐదవ కుమారుడు రద్దయి. 15యెష్షయి ఆరవ కుమారుడు ఓజెము కాగా ఏడవ కుమారుడు దావీదు. 16సెరూయా, అబీగయీలు ఇద్దరూ వారి తోడబట్టిన ఆడపిల్లలు. సెరూయాకు అబీషై, యోవాబు, అశాహేలు అనే ముగ్గురు కుమారులు. 17అబీగయీలు కుమారుడు అమాశా. అమాశా తండ్రి పేరు యెతెరు. యెతెరు ఇష్మాయేలీయులవాడు. 18హెస్రోను కుమారుడు కాలేబు. తన భార్య అజూబా ద్వారా కాలేబు సంతానవంతుడయ్యాడు. అజూబా యెరీయోతు కుమార్తె. యేషెరు, షోబాబు మరియు అర్దోను అనేవారు అజూబా కుమారులు. 19అజూబా చనిపోయిన పిమ్మట కాలేబు ఎఫ్రాతాను పెండ్లి చేసుకొన్నాడు. కాలేబుకు ఎఫ్రాతావల్ల హూరు అనే కుమారుడు కలిగాడు. 20ఊరి అనేవాడు హూరు కుమారుడు. ఊరికి బెసలేలు అను కుమారుడు కలిగాడు. 21పిమ్మట హెస్రోను అరువది సంవత్సరాల వాడైనప్పుడు మాకీరు కుమార్తెను వివాహమాడాడు. మాకీరు అనేవాడు గిలాదుకు తండ్రి. హెస్రోను మాకీరు కుమార్తెను కలియగా ఆమెకు సెగూబు అనేవాడు పుట్టెను. 22సెగూబుకు పుట్టినవాడు యాయీరు. యాయీరుకు గిలాదు దేశంలో ఇరవైమూడు నగరాలున్నాయి. 23కాని గెషూరు వారు, అరాము (సిరియ) వారు యాయీరు గ్రామాలను తీసుకొన్నారు. వాటిలో కెనాతు, దాని చుట్టుపట్ల గ్రామాలు వున్నాయి. అవి మొత్తం అరువది చిన్న చిన్న పట్టణాలు. ఈ పట్టణాలన్నీ గిలాదు తండ్రి అయిన మాకీరు సంతతివారికి చెందినవి. 24హెస్రోను కాలేబదైన ఎఫ్రాతాలో చనిపోయాడు. హెస్రోను చనిపోయిన తరువాత అతని భార్య అబీయా ప్రసవించింది. ఆ పుట్టినవాని పేరు అష్షూరు. అష్షూరుకు పుట్టినవాడు తెకోవ. 25యెరహ్మయేలు హెస్రోను పెద్ద కుమారుడు. రాము, బూనా, ఓరెను, ఓజెము మరియు అహీయా అనేవారు యెరహ్మెయేలు కుమారులు. యెరహ్మెయేలు పెద్ద కుమారుడు రాము. 26యెరహ్మెయేలుకు అటారా అనే మరొక భార్య ఉన్నది. అటారా ఓనాముకు తల్లి. 27యెరహ్మెయేలు పెద్ద కుమారుడు రాముకు కుమారులున్నారు. వారి పేర్లు మయజు, యామీను, ఏకెరు. 28షమ్మయి, యాదా ఇద్దరూ ఓనాము కుమారులు. నాదాబు, అబీషూరులిద్దరూ షమ్మయి కుమారులు. 29అబీషూరు భార్య పేరు అబీహయిలు. అబీహయిలు అతనికి ఇద్దరు కుమారులను కన్నది. అబాను, మొలీదు అని వారి పేర్లు. 30సెలెదు, అప్పయీములిద్దరూ నాదాబు కుమారులు. సెలెదు సంతానం లేకుండానే చనిపోయాడు. 31అప్పయీము కుమారుని పేరు ఇషీ. ఇషీ కుమారుడు షేషాను. షేషాను కుమారుని పేరు అహ్లయి. 32షమ్మయి సోదరుని పేరు యాదా. యెతెరు, యోనాతాను ఇద్దరూ యాదా కుమారులు. యెతెరు సంతానం లేకుండానే మరణించాడు. 33పేలెతు, జాజాలిద్దరూ యోనాతాను కుమారులు. ఇది యెరహ్మెయేలు సంతతి జాబితా. 34షేషానుకు కుమారులు లేరు. అతనికి అందరూ కుమార్తెలే. షేషాను వద్ద ఈజిప్టుకు చెందిన ఒక సేవకుడున్నాడు. వాని పేరు యర్హా. 35షేషాను కుమార్తెను, యర్హా వివాహం చేసికొన్నాడు. ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. వాని పేరు అత్తయి. 36అత్తయి కుమారుని పేరు నాతాను. నాతాను కుమారుడు జాబాదు. 37జాబాదు కుమారుడు ఎఎ్లాలు. ఎఎ్లాలు కుమారుడు ఓబేదు. 38ఓబేదు కుమారుడు యెహూ. యెహూ కుమారుడు అజర్యా. 39అజర్యా కుమారుడు హేలెస్సు. హేలెస్సు కుమారుడు ఎలాశా. 40ఎలాశా కుమారుడు సిస్మాయీ. సిస్మాయీ కుమారుడు షల్లూము. 41షల్లూము కుమారుడు యెకమ్యా. యెకమ్యా కుమారుడు ఎలీషామా. 42యెరహ్మయేలు సోదరుడు కాలేబు. కాలేబుకు కొందరు కుమారులున్నారు. అతని మొదటి కుమారుడు మేషా. మేషా కుమారుడు జీపు. జీపు కుమారుడు మారేషా. మారేషా కుమారుడు హెబ్రోను. 43హెబ్రోను కుమారులు కోరహు, తప్పూయ, రేకెము మరియు షెమ అనువారు. 44షెమ కుమారుడు రహము. రహము కుమారుడు యోర్కెయాము. రేకెము కుమారుడు షమ్మయి. 45షమ్మయి కుమారుడు మాయోను. మాయోను కుమారుడు బేత్సూరు. 46కాలేబు దాసి పేరు ఏయిఫా. ఏయిఫా కుమారులు హారాను, మోజా మరియు గాజేజు అనువారు. హారాను కుమారుని పేరు కూడ గాజేజు. 47యెహ్దయి కుమారులు రెగెము, యోతాము, గేషాను, పెలెటు, ఏయిఫా మరియు షయపు. 48మయకా అనే స్త్రీ కాలేబు యొక్క మరో దాసి. మయకాకు పుట్టిన కుమారులు షెబెరు మరియు తిర్హానా అనేవారు. 49మయకా ఇంకా షయపు, షెవా అను వారికి కూడ తల్లి. షయపు కుమారుడు మద్మన్నా. షెవా కుమారులు మక్బేనా మరియు గిబ్యా. కాలేబు కుమార్తె పేరు అక్సా. 50ఇది కాలేబు సంతతి: కాలేబు మొదటి కుమారుని పేరు హూరు. ఇతడు ఎఫ్రాతాకు పుట్టినవాడు. హూరు కుమారుడు శోబాలు. శోబాలు కుమారుని పేరు కిర్యత్యారీము. 51తరువాతివారు శల్మా మరియు హారేపు. శల్మా కుమారుడు బెత్లేహేము. హారేపు కుమారుడు బేత్గాదేరు. 52శోబాలు కిర్యత్యారీము స్థాపకుడు. శోబాలు సంతతి వారు: హారోయే మరియు మనుహతీలోని వారిలో సగంభాగం: 53మరియు కిర్యత్యారీము సంతతి కుటుంబాల వారు. వీరు: ఇత్రీయులు, పూతీయులు, షుమ్మాతీయులు, మిష్రాయీయులు. మిష్రాయీయుల సంతతివారే సొరాతీయులు, ఎష్తాయులీయులు. 54శల్మా సంతతి వారెవరనగా: బేత్లెహేము, నెటోపాతీయులు, అతారోతు, బేత్యోవాబు ప్రజలు; మనుహతీయులలో సగం మందిగా వున్న జారీయులు, 55మరియు యబ్బేజులో నివసిస్తున్న చరిత్రాది విషయాలు, దస్తావేజులు రాసే లేఖకులు. ఈ లేఖకులు తిరాతీయులు, షిమ్యాతీయులు, శూకోతీయులకు చెందిన వంశాల వారు. హమాతు సంతతి వారైన కేనీయులే ఈ లేఖకులు. బేత్ — రేకాబు వంశీయులకు హమాతు మూలపురుషుడు.


Copyrighted Material
Learn More

will be added

X\