యెషయా 12

1ఆ సమయంలో మీరంటారు: “యెహోవా, నిన్ను నేను స్తుతిస్తున్నాను. నీకు నామీద కోపం వచ్చింది. కానీ ఇప్పుడు నామీద కోపగించకుము. నీ ప్రేమ నాకు చూపించు.” 2దేవుడు నన్ను రక్షిస్తున్నాడు. ఆయన్నే నేను నమ్ముకొంటాను. నాకేం భయంలేదు. ఆయన నన్ను రక్షిస్తాడు. యెహోవా, యెహోవాయే నా బలం. ఆయన నన్ను రక్షిస్తున్నాడు. నేను ఆయనకు స్తోత్రగీతాలు పాడుతాను. 3రక్షణ ఊటల్లోనుండి మీ నీళ్లు తెచ్చు కోండి. అప్పుడు మీరు సంతోషిస్తారు. 4“యెహోవాకు స్తోత్రాలు! ఆయన నామం ఆరాధించండి! ఆయన చేసిన కార్యాలను గూర్చి ప్రజలందరితో చెప్పండి” అని అప్పుడు మీరు అంటారు. 5యెహోవాను గూర్చిన స్తోత్రగీతాలు పాడండి. ఎందుకంటే, ఆయన గొప్ప కార్యాలు చేశాడు గనుక. దేవుని గూర్చిన ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా ప్రకటించండి. పజలందర్నీ ఈ విషయాలు తెలుసుకోనివ్వండి. 6సీయోను ప్రజలారా, ఈ సంగతులను గూర్చికేకలు వేయండి. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు శక్తివంతంగా మీతో ఉన్నాడు. అందుచేత, సంతోషంగా ఉండండి!


Copyrighted Material
Learn More

will be added

X\