యోబు 17

1“నా ఆత్మ భగ్నమై పోయింది. విడిచి పెట్టే సేందుకు నేను సిద్ధం. నా జీవితం దాదాపు గతించిపోయింది, సమాధి నాకోసం నిరీక్షిస్తోంది. 2మనుష్యలు నా చుట్టూరా నిలిచి నన్ను చూసి నవ్వుతున్నారు. వారు నన్ను ఆట పట్టిస్తూ అవమానిస్తూ ఉంటే నేను వారిని గమనిస్తున్నాను. 3“దేవా, నీవు నన్ను (యోబు) నిజంగా బలపరుస్తున్నావని చూపించు, మరి ఎవ్వరూ నన్ను బలపరచరు. 4నా స్నేహితుల మనస్సులను నీవు బంధించేశావు, కనుక వారు నన్ను అర్థం చేసుకోరు. దయచేసి వారిని జయించనీయకు. 5‘ఒకడు తన స్వంత పిల్లలను నిర్లక్ష్యం చేసి తన స్నేహితులకు సహాయం చేస్తాడు అని ప్రజలు చెబుతారని నీకు తెలుసా?’ కాని ఇప్పుడు నా స్నేహితులే నాకు విరోధం అయ్యారు. 6దేవుడు నా పేరును (యోబు) ప్రతి ఒక్కరికీ ఒక చెడ్డ పదంగా చేశాడు. ప్రజలు నా ముఖం మీద ఉమ్మి వేస్తారు. 7నేను చాలా బాధపడుతూ, చాలా విచారంగా ఉన్నాను, కనుక నా కన్నులు దాదాపు గుడ్డివి అయ్యాయి. నా మొత్తం శరీరం ఒక నీడలా చాలా సన్నం అయ్యింది. 8మంచి మనుష్యులు దీని విషయమై కలవరపడు తున్నారు. దేవుని గూర్చి లక్ష్యపెట్టని ప్రజల విషయమై నిర్దోషులు కలవర పడుతున్నారు. 9కాని నీతీమంతులు వాళ్ల పద్ధతులనే చేపడతారు. నిర్దోషులు మరింత బలవంతులపుతారు. 10“కానీ రండి, మీరంతా కలసి, మొత్తం తప్పు నాదే అని నాకు చూపించడానికి మరల ప్రయత్నం చేయండి. మీలో ఎవరూ జ్ఞానం గల వారుకారు. 11నా జీవితం గతించి పోతోంది. నా ఆలోచనలన్నీ నాశనం చేయబడ్డాయి. నా ఆశ అడుగంటింది. 12కాని నా స్నేహితులు రాత్రిని పగలు అనుకొంటారు. చీకటి పడినప్పుడు వెలుగు వస్తోంది, అని వారు అంటారు. 13“నేను కనిపెడుతున్న ఒకే గృహం కనుక పాతాళం అయితే, అంధకార సమాధిలో నేను నా పడక వేసుకొంటే 14సమాధిని చూచి, ‘నీవు నా తండ్రివి అని’ పురుగులను చూసి, ‘నా తల్లివి’ లేక ‘నా సోదరివి’ అని నేను చెప్పవచ్చు 15కాని అదే నాకు ఆశ అయితే నాకు ఎలాంటి ఆశలేదు. మరియు ప్రజలు నాయందు ఏ ఆశ చూడలేరు. 16(నా ఆశ నాతోనే చనిపోతుందా?) అది నేను చని పోయే స్థలంయొక్క లోతుల్లోకి వెళ్తుందా? మన మంతా చేరి బురదలోకి వెళ్తామా?”


Copyrighted Material
Learn More

will be added

X\