యోబు 25

1అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలా జవాబు ఇచ్చాడు: 2“దేవుడే పాలకుడు. ప్రతి మనిషీ దేవునికి భయపడి గౌరవించాలి. దేవుడు తన పరలోక రాజ్యాన్ని శాంతిగా ఉంచుతాడు. 3దేవుని దూతలను ఏ మనిషీ లెక్కించలేడు. దేవుని సూర్యుడు మనుష్యులందరి మీద ఉదయిస్తాడు. 4కానీ దేవుని ఎదుట ఒక మనిషి నిజంగా మంచి వాడుగా ఉండలేడు. స్త్రీకి జన్మించిన మనిషి నిజంగా పరిశుద్ధంగా ఉండలేడు. 5దేవుని దృష్టికి చంద్రుడు కూడా ప్రకాశంగా ఉండడు. దేవుని దృష్టికి నక్షత్రాలు పరిశుద్ధంగా లేవు. 6మనిషి అంతకంటే తక్కువ. మనిషి మట్టి పురుగులాంటివాడు. పనికి మాలిన పురుగులాంటివాడు!”


Copyrighted Material
Learn More

will be added

X\