యోబు 40

1యోబూతో యెహోవా ఇలా చెప్పాడు: 2“యోబూ, సర్వశక్తిమంతుడైన దేవునితో నీవు వాదించావు. తప్పు చేశానని నీవు నాకు తీర్పు చెప్పావు. ఇప్పుడు నీవు తప్పుచేశావని ఒప్పుకుంటావా? నాకు జవాబు ఇస్తావా?” 3అప్పుడు దేవునికి యోబు ఇలా జవాబు చెప్పాడు. యోబు అన్నాడు: 4“నేను ముఖ్యం కాదు. నీకు నేను ఏమి చెప్పగలను? నీకు నేను జవాబు ఇవ్వలేను. నా చేతితో నేను నా నోరు మూసుకొంటాను. 5నేను ఒకసారి మాట్లాడాను కానీ నేను మరల జవాబు ఇవ్వను. నేను రెండుసార్లు మాట్లాడాను. కానీ నేను ఇంకా ఏమీ చెప్పను.” 6అప్పుడు యెహోవా తుఫానులోంచి మరల యోబుతో ఇలా మాట్లాడాడు. యెహోవా అన్నాడు: 7“యోబూ, మగవాడిలా నిలబడు. నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను నీవు నాకు జవాబు చెప్పు. 8“యోబూ నేను న్యాయంగా లేనని నీవు తలుస్తున్నావా? నీదే సరిగ్గా ఉన్నట్లు కనబడేలా చేయాలని, నేను తప్పు చేశానని నీవు నన్ను నిందిస్తావా? 9యోబూ, నీ చేతులు దేవుని చేతులంత బలంగా ఉన్నాయా? నీ స్వరాన్ని నా స్వరంలా ఉరిమేట్టు నీవు చేయగలవా? 10ఒకవేళ నీవు అలా దేవునిలా చేయగలిగితే నీకు నీవే ఘనత, మహిమ, ఆపాదించుకో. మహిమ, తేజస్సును వస్త్రాల్లా ధరించు. 11యోబూ, నీవు నావలె ఉంటే గర్విష్ఠులను తక్కువగా చూడు. యోబూ, ఆ గర్విష్ఠుల మీద నీ కోపం కుమ్మరించు. ఆ గర్విష్ఠులను దీనులుగా చేయి. 12అవును, యోబూ, ఆ గర్విష్ఠులను చూడు. వారిని దీనులనుగా చేయి. దుర్మార్గులను వారు ఉన్న చోటనే చితుకగొట్టు. 13గర్విష్ఠులందరినీ మట్టిలో పాతిపెట్టు. వారి శరీరాలను చుట్టేసి వారి సమాధులలో పెట్టు 14యోబూ, నీవు గనుక వీటన్నింటినీ చేయగలిగితే అప్పుడు నిన్ను నీవే రక్షించుకొనుటకు సమర్ధుడ వని నీ దగ్గర నేను ఒప్పుకొంటాను. 15“యోబూ, నీటి గుర్రాన్ని చూడు. నేను (దేవుణ్ణి) నీటి గుర్రాన్ని చేశాను. మరియు నిన్నూ (యోబు) నేను చేశాను. నీటి గుర్రం ఆవులా గడ్డి తింటుంది. 16నీటి గుర్రం శరీరంలో చాలా బలం ఉంది. దాని కడుపులోని కండరాలు చాలా శక్తివంతంగా ఉంటాయి. 17నీటి గుర్రం తోక దేవదారు వృక్షంలా బలంగా నిలుస్తుంది. దాని కాలి కండరాలు చాలా బలంగా ఉంటాయి. 18నీటి గుర్రం యొక్క ఎముకలు ఇత్తడిలా గట్టిగా ఉంటాయి. దాని కాళ్లు ఇనుప కడ్డీలా ఉంటాయి. 19నీటి గుర్రం నేను (దేవుణ్ణి) చేసిన మహా అద్భుత జంతువు. కాని నేను దానిని ఓడించగలను. 20అడవి జంతువులు ఆడుకొనే కొండల మీద నీటి గుర్రం తినే గడ్డి పెరుగుతుంది. 21తామర చెట్ల కింద నీటి గుర్రం పండుకుంటుంది. జమ్ము గడ్డీ మడుగులలో నీటి గుర్రం దాక్కుంటుంది. 22తామర మొక్కలు తమ నీడలో నీటి గుర్రాన్ని దాచిపెడతాయి. నది సమీపంగా పెరిగే నిరవంజి చెట్ల కింద అది నివసిస్తుంది. 23నది వరదలై పొర్లినా నీటి గుర్రం పారిపోదు. యొర్దాను నది దాని ముఖం మీద చిమ్మితే అది భయపడదు. 24నీటి గుర్రానికి కళ్లు కట్టి ఒక ఉచ్చులో దానిని ఎవరూ పట్టుకొనలేరు.


Copyrighted Material
Learn More

will be added

X\