సామెతలు 10

1ఇవి సొలొమోను సామెతలు (జ్ఞానముగల మాటలు): జ్ఞానముగల కుమారుడు తన తండ్రిని సంతోషపెడతాడు. కాని బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దు:ఖం కలిగిస్తాడు. 2ఒకడు చెడు కార్యములు చేయుట వలన అతనికి డబ్బు వస్తే అది పనికిమాలిన డబ్బు అవుతుంది. కాని మంచిని జరిగించిన ఎడల అది మరణం నుండి నిన్ను రక్షించగలుగుతుంది. 3యెహోవా మంచి మనుష్యుల విషయమై శ్రద్ధ పుచ్చుకొంటాడు. వారికి అవసరమైన భోజనాన్ని ఆయన వారికి ఇస్తాడు. కాని దుర్మార్గులకు అవసరమైన వాటిని యెహోవా తొలగించి వేస్తాడు. 4బద్ధకస్తుడు వేదవాడుగా ఉంటాడు. కాని కష్టపడి పనిచేసేవాడు ధనికుడు అవుతాడు. 5తెలివిగల వాడు సకాలంలో పంట కూర్చుకొంటాడు. కాని కోత కాలంలో నిద్రపోయేవాడు అవమానము కలిగించే కుమారుడు. 6మంచి మనిషిని ఆశీర్వదించమని మనుష్యులు దేవుని అడుగుతారు. ఆ మంచి విషయాలను చెడ్డవారు చెప్పవచ్చు కాని వారు తల పెడుతున్న చెడు విషయాలను వారి మాటలే కప్పిపుచ్చుతాయి. 7మంచి మనుష్యుల కార్యములను జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరము. కాని చెడ్డవారి పేరు మరువ బడును. 8జ్ఞానముగల మనిషితో ఎవరైనా ఏదైనా చేయుమని చెబితే అతడు విధేయుడవుతాడు. కాని బుద్ధిహీనుడు వాదించి తనకు తానే కష్టం తెచ్చుకుంటాడు. 9నిజాయితీగల ఒక మంచి మనిషి క్షేమంగా ఉంటాడు. కాని మోసం చేసే కపటియైన వ్యక్తి పట్టు బడతాడు. 10సత్యమును దాచిపెట్టే మనిషి కష్టాలు కలిగిస్తాడు. బాహాటంగా మాట్లాడేవాడు శాంతి కలిగిస్తాడు. 11ఒక మంచి మనిషి మాటలు జీవితాన్ని మెరుగు పరుస్తాయి. కానీ ఒక దుర్మార్గుని మాటలు అతని అంతరంగంలో ఉన్న చెడును చూపిస్తాయి. 12ద్వేషం వాదాలు పుట్టిస్తుంది. కానీ మనుష్యులు చేసే ప్రతి తప్పునూ ప్రేమ క్షమిస్తుంది. 13జ్ఞానముగల వారు వినదగిన మాటలు చెబుతారు. కానీ బుద్ధిహీనులు వారి పాఠం వారు నేర్చుకొనక ముందే శిక్షించబడాలి. 14జ్ఞానముగల వారు నెమ్మదిగా ఉంటారు, కొత్త విషయాలు నేర్చుకొంటారు. కానీ బుద్ధిహీనులు మాట్లాడి వారికి వారే కష్టాలు తెచ్చుకొంటారు. 15ధనికుడ్ని ఐశ్వర్యం కాపాడుతుంది. మరియు పేదవాడ్ని పేదరికం పాడు చేస్తుంది. 16ఒక మనిషి మంచి చేస్తే, అతనికి బహుమానం ఇవ్వబడుతుంది. అతనికి జీవం యివ్వబడుతుంది.దుర్మార్గత శిక్షను మాత్రమే తెచ్చి పెడుతుంది. 17తన శిక్ష మూలంగా నేర్చుకొన్నవాడు ఇతరులు జీవించటానికి సహాయం చేయగలుగుతాడు. అయితే నేర్చుకొనేందుకు అంగీకరించని వాడు మనుష్యులను తప్పు త్రోవలో మాత్రమే నడిపించగలడు. 18తన ద్వేషాన్ని దాచిపెట్టేవాడు అబద్ధం చెబుతూ ఉండవచ్చు. కానీ బుద్ధిహీనుడు తాను మాత్రమే ప్రచారం చేసేందుకు చెప్పేటటువంటి మాటల కోసం ప్రయత్నిస్తాడు. 19అధికంగా మాట్లాడేవాడు తనకు తానే కష్టం తెచ్చుకొంటాడు. జ్ఞానముగలవాడు ఊరక ఉండుట నేర్చుకొంటాడు. 20మంచి మనిషి మాటలు స్వచ్ఛమైన వెండిలా ఉంటాయి. కానీ దుర్మార్గుని తలంపులు పనికి మాలినవిగా ఉంటాయి. 21ఒక మంచి మనిషి మాటలు అనేకులకు సహాయం చేస్తాయి. కానీ బుద్ధిహీనుని మూర్ఖత్వం అతన్నే పాడు చేస్తాయి. 22యెహోవా దీవెన నీకు ఐశ్వర్యం ఇస్తుంది. మరియు ఆ ఐశ్వర్యం దానితో బాటు కష్టాలు తీసుకొని రాదు. 23బుద్ధిహీనుడు తప్పు చేయుటలో ఆనందిస్తాడు. కానీ జ్ఞానముగలవాడు జ్ఞానములో ఆనందిస్తాడు. 24దుర్మార్గుడు తాను భయపడే విషయాల మూలంగా ఓడించబడుతాడు. కానీ మంచివాడు తాను కోరుకొనే వాటిని పోందుతాడు. 25సుడిగాలి వీచినప్పుడు దుర్మార్గులు నాశనమవుదురు. కానీ మంచివాళ్లకు శాశ్వతమైన పునాది వుంటుంది. వాళ్లు శాశ్వతంగా ఉంటారు. 26బద్ధకస్తుణ్ణి ఎన్నడూ నీ కోసం ఏదీ చేయనీయకు. నీ నోట చిరకలా, లేక నీ కళ్లలో పొగలా అతడు నిన్ను చికాకు పెడతాడు. 27నీవు యెహోవాను గౌరవిస్తే, నీవు చాలా కాలం బతుకుతావు. కానీ దుర్మార్గులు వారి జీవితంలోనుండి కొన్ని సంవత్సరాలు పోగొట్టుకొంటారు. 28మంచి మనుష్యులు నిరీక్షించే విషయాలు సంతోషం కలిగిస్తాయి. దుర్మార్గులు నిరీక్షించే విషయాలు నాశనం తెచ్చి పెడతాయి. 29మంచి మనుష్యులను యెహోవా కాపాడుతాడు. కానీ తప్పుచేసే వారిని యెహోవా నాశనం చేస్తాడు. 30మంచి మనుష్యులు ఎల్లప్పుడూ క్షేమంగా ఉంటారు. కానీ దుర్మార్గులు బలవంతంగా దేశం నుండి వెళ్లగొట్టబడతారు. 31మంచి మనుష్యులు జ్ఞానముగల మాటలు చెబుతారు. కానీ కష్టం తెచ్చి పెట్టే వాని మాటలు వినటం మనుష్యులు మానివేస్తారు. 32మంచి మనుష్యులకు సరైన సంగతులు చెప్పటం తెలుసు. కానీ దుర్మార్గులు కష్టం తెచ్చిపెట్టే మాటలు చెబుతారు.


Copyrighted Material
Learn More

will be added

X\