కీర్తనలు 118

1యెహోవా దేవుడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి. నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది. 2“నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది” అని ఇశ్రాయేలూ, నీవు చెప్పుము. 3“నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది” అని యాజకులారా, మీరు చెప్పండి. 4“నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది” అని యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరు చెప్పండి. 5నేను కష్టంలో ఉన్నాను. గనుక సహాయం కోసం నేను యెహోవాకు మొర పెట్టాను, యెహోవా నాకు జవాబిచ్చి, నన్ను విముక్తుని చేశాడు. 6యెహోవా నాతో ఉన్నాడు గనుక నేను భయ పడను. నన్ను బాధించుటకు మనుష్యులు ఏమీ చేయలేరు. 7యెహోవా నా సహాయకుడు; నా శత్రువులు ఓడించబడటం నేను చూస్తాను. 8మనుష్యులను నమ్ముకొనుటకంటే యెహోవాను నమ్ముట మేలు. 9మీ నాయకులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. 10అనేకమంది శత్రువులు నన్ను చుట్టుముట్టారు. యెహోవా శక్తిలో నేను నా శత్రువులను ఓడించాను. 11శత్రువులు మరల మరల నన్ను చుట్టుముట్టారు. యెహోవా శక్తితో నేను వారిని ఓడించాను. 12తేనెటీగల దండులా శత్రువులు నన్ను చుట్టుముట్టారు. కాని వేగంగా కాలిపోతున్న పాదలా వారు అంతం చేయబడ్డారు. యెహోవా శక్తితో నేను వారిని ఓడించాను. 13నా శత్రువు నా మీద దాడి చేసి దాదాపుగా నన్ను నాశనం చేశాడు. కాని యెహోవా నాకు సహాయం చేశాడు. 14యెహోవా నా బలం, నా విజయ గీతం! యెహోవా నన్ను రక్షిస్తాడు! 15మంచివాళ్ల ఇండ్లలో విజయ ఉత్సవం మీరు వినగలరు. యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు. 16యెహోవా చేతులు విజయంతో పైకి ఎత్తబడ్డాయి. యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు. 17నేను జీవిస్తాను! కాని మరణించను. మరియు యెహోవా చేసిన వాటిని గూర్చి నేను చెబతాను. 18యెహోవా నన్ను శక్షించాడు, కాని ఆయన నన్ను చావనియ్య లేదు. 19మంచి గుమ్మములారా నా కోసం తెరచుకోండి, నేను లోనికి వచ్చి యెహోవాను ఆరాధిస్తాను. 20అవి యెహోవా గుమ్మాలు. ఆ గుమ్మాలలో నుండి మంచివాళ్లు మాత్రమే వెళ్లగలరు. 21యెహోవా, నా ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నన్ను రక్షించినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. 22ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూల రాయి అయ్యింది. 23ఇలా జరుగునట్లు యెహోవా చేశాడు. అది ఆశ్చర్యంగా ఉందని అనుకొంటున్నాము. 24ఈ వేళ యెహోవా చేసిన రోజు. ఈ వేళ మనం ఆనందించి సంతోషంగా ఉందాము! 25ప్రజలు ఇలా చెప్పారు, “యెహోవాను స్తుతించండి. దేవుడు, మమ్మల్ని రక్షించెను. దేవా, దయచేసి మమ్మల్ని వర్ధిల్లజేయుము. 26యెహోవా నామమున వస్తున్న వానికి స్వాగతం చెప్పండి.” యాజకులు ఇలా జవాబు ఇచ్చారు, “యెహోవా ఆలయానికి మేము నిన్ను ఆహ్వానిస్తున్నాము! 27యెహోవాయే దేవుడు. ఆయన మనలను అంగీకరిస్తాడు. బలి కోసం గొర్రెపిల్లను కట్టివేయండి. బలిపీఠపు కొమ్ముల వద్దకు గొర్రెపిల్లను మోసి కొని రండి.” 28యెహోవా, నీవు నా దేవుడవు. నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేను నిన్ను స్తుతిస్తున్నాను. 29యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి. నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.


Copyrighted Material
Learn More

will be added

X\