కీర్తనలు 129

1నా జీవిత కాలమంతా నాకు ఎంతోమంది శత్రువులు. ఇశ్రాయేలూ, ఆ శత్రువులను గూర్చి మాకు చెప్పుము. 2నా జీవిత కాలమంతా నాకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు కానీ వారు ఎన్నడూ జయించలేదు. 3నా వీపుమీద లోతైన గాయాలు అయ్యేంతవరకు వారు నన్ను కొట్టారు. నాకు చాలా పెద్ద, లోతైన గాయాలు అయ్యాయి. 4అయితే దయగల యెహోవా తాళ్ళను తెగకోసి ఆ దుర్మార్గులనుండి నన్ను విడుదల చేసాడు. 5సీయోనును ద్వేషించిన మనుష్యులు ఓడించబడ్డారు. వారు పోరాటం మానివేసి పారిపోయారు. 6ఆ మనుష్యులు ఇంటి కప్పు మీద మొలచిన గడ్డిలాంటి వాళ్లు. ఆ గడ్డి ఎదుగక ముందే చస్తుంది. 7పని వానికి ఆ గడ్డి గుప్పెడు కూడా దొరకద. ధాన్యపు పన కట్టేందుకు కూడా అది సరిపోదు. 8ఆ దుర్మార్గుల పక్కగా నడుస్తూ వెళ్లే మనుష్యులు, “యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అని చెప్పారు.” “యెహోవా నామమున మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము” అని చెబుతూ మనుష్యులు వారిని ఏమీ అభినందించరు.


Copyrighted Material
Learn More

will be added

X\