కీర్తనలు 149

1యెహోవాను స్తుతించండి. యెహోవా చేసిన కొత్త సంగతులను గూర్చి ఒక కొత్త కీర్తన పాడండి! ఆయన అనుచరులును కూడుకొనే సమావేశంలో ఆయనకు స్తుతి పాడండి. 2ఇశ్రాయేలును దేవుడు చేశాడు. ఇశ్రాయేలును యెహోవాతో కలసి అనందించనివ్వండి. సీయోను మీది ప్రజలను వారి రాజుతో కూడా ఆనందించనివ్వండి. 3ఆ ప్రజలు వారి తంబురాలు, స్వరమండలాలు వాయిస్తూ నాట్యమాడుతూ దేవుని స్తుతించ నివ్వండి. 4యెహోవా తన ప్రజలను గూర్చి సంతోషిస్తున్నాడు. దేవుడు తన దీన ప్రజలకు ఒక అద్భుత క్రియ చేశాడు. ఆయన వారిని రక్షించాడు! 5దేవుని అనుచరులారా, మీ విజయంలో ఆనందించండి. పడకలు ఎక్కిన తరువాత కూడ సంతోషించండి. 6ప్రజలు దేవునికి గట్టిగా స్తుతులు చెల్లించెదరుగాక. ప్రజలు తమ చేతులలో వారి ఖడ్గాలు పట్టుకొని 7వెళ్లి వారి శత్రువులను శిక్షించెదరుగాక. వారు వెళ్లి యితర ప్రజలను శిక్షించెదరుగాక. 8ఆ రాజులకు, ప్రముఖులకు దేవుని ప్రజలు గొలుసులు వేస్తారు. 9దేవుడు ఆజ్ఞాపించినట్టే దేవుని ప్రజలు వారి శత్రువులను శిక్షిస్తారు. దేవుని అనుచరులకు ఆయన ఆశ్చర్యకరుడు. యెహోవాను స్తుతించండి!


Copyrighted Material
Learn More

will be added

X\