కీర్తనలు 15

1యెహోవా, నీ పవిత్ర గుడారంలో ఎవరు నివసించగలరు? నీ పవిత్ర పర్వతం మీద ఎవరు నివసించగలరు? 2ఎవరైతే పరిశుద్ధ జీవితం జీవించగలరో, మంచి కార్యాలు చేయగలరో తమ హృదయంలో నుండి సత్యం మాత్రమే మాట్లాడుతారో అలాంటి వ్యక్తులు మాత్రమే నీ పర్వతం మీద నివసించగలరు. 3అలాంటి వ్యక్తి ఇతరులను గూర్చి చెడు సంగతులు మాట్లాడడు. ఆ మనిషి తన పొరుగు వారికి కీడు చేయడు. ఆ మనిషి తన స్వంత కుటుంబం గూర్చి సిగ్గుకరమైన విషయాలు చెప్పాడు. 4ఆ మనిషి దేవుని చేత నిరాకరింపబడిన ప్రజలను గౌరవించడు. ఆయితే యోహోవాను సేవించే వారందరినీ ఆ మనిషి గౌరవిస్తాడు. ఆ మనిషి గనుక తన పొరుగువానికి ఒక వాగ్దానం చేస్తే అతడు ఏమి చేస్తానన్నాడో దాన్ని నెరవేరుస్తాడు. 5ఆ మనిషి ఎవరికైనా అప్పీస్తే అతడు దాని మీద వడ్డీ తీసుకోడు. నిర్దోషులకు కీడు చేయుటకుగాను అతడు డబ్బు తీసుకోడు. ఒక మనిషి ఆ మంచి వ్యక్తిలాగ జీవిస్తే అప్పుడు ఆ మనిషి ఎల్లప్పుడూ దేవునికి సన్నిహితంగా ఉంటాడు.


Copyrighted Material
Learn More

will be added

X\