కీర్తనలు 23

1యెహోవా నా కాపరి నాకు కొరత ఉండదు 2పచ్చటి పచ్చిక బయళ్లలో ఆయన నన్ను పడుకో పెడతాడు. ప్రశాంతమైన నీళ్లవద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు. 3ఆయన తన నామ ఘనత కోసం నా ఆత్మకు నూతన బలం ప్రసాదిస్తాడు. ఆయన నిజంగా మంచివాడని చూపించేందుకు ఆయన నన్ను మంచితనపు మార్గాల్లో నడిపిస్తాడు. 4చివరికి మరణాంధకారపు లోయలో నడిచినప్పుడు కూడా నేను భయపడను. ఎందుకంటే, యెహోవా, నీవు నాతో ఉన్నావు నీ చేతికర్ర, నీ దండం నన్ను ఆదరిస్తాయి కనుక. 5యెహోవా, నా శత్రువుల ఎదుటనే నీవు నాక భోజనం సిద్ధం చేశావు. నూనెతో నా తలను నీవు అభిషేకిస్తావు. నా పాత్ర నిండి, పొర్లిపోతుంది. 6నా మిగిలిన జీవితం అంతా మేలు, కరుణ నాతో ఉంటాయి. మరియు నేను ఎల్లకాలం యెహోవా ఆలయంలో నివసిస్తాను.


Copyrighted Material
Learn More

will be added

X\