కీర్తనలు 48

1యెహోవా గొప్పవాడు. మన దేవుని పట్టణంలో, ఆయన పరిశుద్ధ పట్టణంలో స్తుతులకు ఆయన పాత్రుడు. 2దేవుని పరిశుద్ధ పర్వతం అందమైనది, ఎతైనది. అది భూమి అంతటికీ సంతోషాన్ని తెస్తుంది. సీయోను పర్వతం దేవుని నిజమైన పర్వతం. అది మహారాజు పట్టణం. 3ఇక్కడ ఆ పట్టణంలోని, భవనాలలో దేవుడు కోట అని పిలువబడుతున్నాడు. 4ఒకప్పుడు రాజులు కొందరు సమావేశ మయ్యారు. వారు ఈ పట్టణంపై దాడి చేయాలని పథకం వేసారు. వారంతా కలసి ముందుకు వచ్చారు. 5ఆ రాజులు చూసారు. వారు ఆశ్చర్యపోయారు, వారు బెదరిపోయారు. మరియు వారంతా పారిపోయారు! 6ఆ రాజులందరికీ భయం పట్టుకొంది. ప్రసవ వేదన పడుతున్న స్త్రీలలా వారు వణికారు. 7దేవా, బలమైన తూర్పుగాలితో తర్షీషు ఓడలను బద్దలు చేశావు. 8మేము ఏమి విన్నామో దాన్ని మహా శక్తిగల దేవుని పట్టణంలో చూశాము, మన సర్వశక్తిమంతుడైన యెహోవా పట్టణంలో. దేవుడు ఆ పట్టణాన్ని శాశ్వతంగా బలపరుస్తాడు. 9దేవా, నీ ప్రేమా కనికరాలను గూర్చి మేము నీ ఆలయంలో జాగ్రత్తగా ఆలోచిస్తాము. 10దేవా, నీవు ప్రఖ్యాతిగలవాడవు. భూలోక మంతటా ప్రజలు నిన్ను స్తుతిస్తారు. నీ కుడిచేయి నీతితో నిండియున్నది. 11సీయోను పర్వతం సంతోషిస్తుంది. మరియు యూదా నగరాలు ఆనందంగా వున్నాయి. దేవా, ఎందుకంటే నీవు మంచి తీర్పులు చేశావు. 12సీయోను చుట్టూ తిరుగుతూ ఆ పట్టణాన్ని చూడండి, గోపురాలు లెక్కించండి. 13ఎత్తైన గోడలు చూడండి. సీయోను రాజనగరుల ద్వారా వెళ్ళండి. అప్పుడు తరువాత తరాలకు మీరు దాన్ని గూర్చి చెప్పగలుగుతారు. 14దేవుడు నిజంగా ఎల్లప్పుడూ శాశ్వతంగా మన దేవుడై ఉంటాడు. ఆయనే మనలను శాశ్వతంగా నడిపిస్తాడు. మరియు ఆయన ఎన్నటికీ మరణించడు!


Copyrighted Material
Learn More

will be added

X\