కీర్తనలు 54

1దేవా, నీ నామం ద్వారా నన్ను రక్షించుము. నన్ను విడుదల చేయుటకు నీ శక్తి ఉపయోగించుము. 2దేవా నా ప్రార్థనను, నేను చెప్పే సంగతులను ఆలకించుము. 3పరదేశీయులు నాకు విరోధంగా తిరిగారు. బలాఢ్యులైన మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. దేవా ఆ మనుష్యులు నిన్ను కనీసం ఆరాధించరు. 4చూడండి, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. నా ప్రభువు నన్ను బలపరుస్తాడు. 5తమ స్వంత దుష్టత్వముతో నాపై గూఢచారత్వము చేసే జనులను దేవుడు శిక్షిస్తాడు. దేవా, నీవు నాకు నమ్మకస్తుడవై ఉండుటనుబట్టి ఆ జనులను నాశనం చేయుము. 6దేవా, నేను నీకు స్వేచ్ఛార్పణలు ఇస్తాను. యెహోవా, నేను నీకు వందనాలు చెల్లిస్తాను. ఎందుకంటే నీవు మంచివాడవు. 7నీవు నా కష్టాలన్నిటినుండి నన్ను రక్షించావు. మరియు నా శత్రువులు ఓడిపోవటం నేను చూసాను.


Copyrighted Material
Learn More

will be added

X\