కీర్తనలు 63

1దేవా, నీవు నా దేవుడవు. నాకు నీవు ఎంతగానో కావాలి. నా ఆత్మ, నా శరీరం నీళ్లులేక ఎండిపోయిన భూమిలా నీకొరకు దాహంగొని ఉన్నాయి. 2అవును, నీ ఆలయంలో నేను నిన్ను చూశాను. నీ బలము నీ మహిమలను నేను చూశాను. 3నీ ప్రేమ జీవం కన్నా గొప్పది. నా పెదాలు నిన్ను స్తుతిస్తున్నాయి. 4అవును, నా జీవితంలో నేను నిన్ను స్తుతిస్తాను. నీ వేరిట నేను నా చేతులెత్తి నీకు ప్రార్థిస్తాను. 5నేను శ్రేష్ఠమైన ఆహారం భుజించినట్లు నేను తృప్తిపొందుతాను. నా నోరు నిన్ను స్తుతిస్తుంది. 6నేను నా పడక మీద ఉండగా నిన్ను జ్ఞాపకం చేసుకొంటాను. రాత్రి ఝాములలో నిన్ను నేను జ్ఞాపకం చేసుకొంటాను. 7నీవు నిజంగా నాకు సహాయం చేశావు. నీవు నన్ను కాపాడినందుకు నేను సంతోషిస్తున్నాను. 8నా ఆత్మ నిన్ను హత్తుకొంటుంది. నీ కుడిచెయ్యి నన్నెత్తి పట్టుకొంటుంది. 9కొంతమంది మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. కాని వారు నాశనం చేయబడతారు. వారు వారి సమాధుల్లోకి దిగిపోతారు. 10ఖడ్గములతో వారు చంపబడతారు. అడవి కుక్కలు వారి మృత దేహాలను తింటాయి. 11అయితే రాజు తన దేవుని పట్ల సంతోషంగా ఉంటాడు. ఆయనకు విధేయులుగా ఉంటామని ప్రమాణంచేసిన మనుష్యులంతా ఆయనను స్తుతిస్తారు. ఎందుకంటే ఆ అబద్దికులందరినీ ఆయన ఓడించాడు.


Copyrighted Material
Learn More

will be added

X\