కీర్తనలు 70

1దేవా, నన్ను రక్షించుము. దేవా త్వరపడి నాకు సహాయం చేయుము. 2మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. వారిని నిరాశపరచుము. వారిని అవమానించుము. మనుష్యులు నాకు చెడు కార్యాలు చేయాలని కోరుతున్నారు. వారు పడిపోయి సిగ్గు అనుభవిస్తారని నా నిరీక్షణ. 3మనుష్యులు నన్ను హేళన చేసారు. వారికి తగినదాన్ని పొందుతారని నా నిరీక్షణ. 4నిన్ను ఆరాధించే ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. నీ మూలంగా రక్షించబడుటకు ఇష్టపడే మనుష్యులు ఎల్లప్పుడూ నిన్ను స్తుతించగలుగుతారు. 5నేను నిరుపేదని, నిస్సహాయుణ్ణి. దేవా, త్వరపడి! వచ్చి నన్ను రక్షించుము. దేవా, నన్ను తప్పించగల వాడవు నీవు ఒక్కడవు మాత్రమే. ఆలస్యం చేయవద్దు!


Copyrighted Material
Learn More

will be added

X\