కీర్తనలు 90

1ప్రభూవా, శాశ్వతంగా నీవే మా నివాసం. 2పర్వతాలు, భూమి, ప్రపంచం చేయబడక ముందే నీవు దేవుడిగా ఉండినావు. దేవా, ఇదివరకు ఎల్లప్పుడూ నీవే దేవుడవు మరియు ఎప్పటికి నీవే దేవునిగా ఉంటావు. 3మనుష్యులను తిరిగి మట్టిగా మారుస్తావు. మనుష్య కుమారులారా. తిరిగి రండని నీవు చెప్పుతావు. 4నీ దృష్టిలో వేయి సంవత్సరాలు గడచిపోయిన ఒక రోజువలె ఉంటాయి. గత రాత్రిలా అవి ఉన్నాయి. 5నీవు మమ్మల్ని ఊడ్చివేస్తావు. మా జీవితం ఒక కలలా ఉంది. మర్నాడు ఉదయం మేము ఉండము. మేము గడ్డిలా ఉన్నాము. 6ఉదయం గడ్డి పెరుగుతుంది. సాయంత్రం అది ఎండిపోయి వుంటుంది. 7దేవా, నీకు కోపం వచ్చినప్పుడు మేము నాశనం అవుతాము. నీ కోపం మమ్మల్ని భయపెడుతుంది! 8మా పాపాలు అన్నింటిని గూర్చి నీకు తెలుసు. దేవా, మా రహస్య పాపాలలో ప్రతి ఒక్కటి నీవు చూస్తావు. 9నీ కోపం నా జీవితాన్ని అంతం చేయవచ్చు. మా సంవత్సరాలు నిట్టూర్పులా అంతమయి పోతాయి. 10మేము 70 సంవత్సరాలు జీవిస్తాము. బలంగా వుంటే 80 సంవత్సరాలు జీవిస్తాము. మా జీవితాలు కష్టతరమైన పనితోను బాధతోను నిండి ఉన్నాయి. అప్పుడు అకస్మాత్తుగా మా జీవితాలు అంతం అవుతాయి. మేము ఎగిరిపోతాము. 11దేవా, నీ కోపం యొక్క పూర్తి శక్తి ఏమిటో నిజంగా ఎవరికీ తెలియదు. కాని దేవా, నీ యెడల మాకున్న భయము, గౌరవం నీ కోపమంత గొప్పవి. 12మాకు జ్ఞానోదయం కలిగేలా మా జీవితాలు నిజంగా ఎంత కొద్దిపాటివో మాకు నేర్పించుము. 13యెహోవా, ఎల్లప్పుడూ మా దగ్గరకు తిరిగి రమ్ము. నీ సేవకులకు దయ చూపించుము. 14ప్రతి ఉదయం నీ ప్రేమతో మమ్మల్ని నింపుము. మేము సంతోషించి, మా జీవితాలు అనుభవించగలిగేలా చేయుము. 15మా జీవితాల్లో చాలా దుఃఖం, కష్టాలు నీవు కలిగించావు. ఇప్పుడు మమ్మల్ని సంతోషింపచేయుము. 16వారి కోసం నీవు చేయగల ఆశ్చర్య కార్యాలను నీ సేవకులను చూడనిమ్ము. వారి సంతానాన్ని నీ ప్రకాశమును చూడనిమ్ము. 17మా దేవా, మా ప్రభూ, మా యెడల దయచూపించుము. మేము చేసే ప్రతిదానిలో మాకు సఫలత అనుగ్రహించుము.


Copyrighted Material
Learn More

will be added

X\