కీర్తనలు 95

1రండి, మనం యెహోవాని స్తుతించుదాము. మన రక్షణా బండైన ప్రభువుకు సంతోషగానం చేద్దాము. 2యెహోవాకు మనం కృతజ్ఞతా కీర్తనలు పాడుదాము. సంతోష గీతాలు మనం ఆయనకు పాడుదాము. 3ఎందుకంటే ఆయన మహా గొప్ప దేవుడు గనుక. ఆయన యితర “దేవుళ్లందరినీ” పాలించే మహా రాజు. 4లోతైన గుహలు, ఎత్తయిన పర్వతాలు యెహోవాకు చెందుతాయి. 5మహా సముద్రమూ ఆయనదే ఆయనే దాన్ని సృష్టించాడు. దేవుడు తన స్వహస్తాలతో పొడినేలను చేశాడు. 6రండి, మనం సాగిలపడి ఆయనను ఆరాధించుదాము. మనలను సృష్టించిన దేవున్ని మనం స్తుతిద్దాము. 7ఆయన మన దేవుడు, మనం ఆయన ప్రజలము. మనం ఆయన స్వరం వింటే నేడు మనం ఆయన గొర్రెలము. 8దేవుడు చెబతున్నాడు, “మెరీబా దగ్గర మీరు ఉన్నట్టుగా అరణ్యంలో మస్సా దగ్గర మీరు ఉన్నట్టుగా మొండిగా ఉండకండి. 9మీ పూర్వీకులు నన్ను శోధించారు. వారు నన్ను పరీక్షించారు. కానీ అప్పుడు నేను ఏమి చేయగలిగానో వారు చూశారు. 10ఆ ప్రజలతో 40 సంవత్సరాలు నేను సహనంగా ఉన్నాను. వారు నమ్మకస్తులు కారని నాకు తెలుసు. ఆ ప్రజలు నా ఉపదేశాలు అనుసరించటానికి నిరాకరించారు. 11అందుచేత నాకు కోపం వచ్చి, ‘వారు నా విశ్రాంతి దేశంలో ప్రవేశించరు అని ప్రమాణం చేశాను.’”


Copyrighted Material
Learn More

will be added

X\