కీర్తనలు 96

1యెహోవా చేసిన కొత్త కార్యాలను గూర్చి ఒక కొత్త కీర్తన పాడుడి! సర్వలోకం యెహోవాకు కీర్తనలు పాడును గాక! 2యెహోవాకు కీర్తన పాడండి. ఆయన నామాన్ని స్తుతించండి. శుభవార్త ప్రకటించండి. ఆయన ప్రతి రోజూ మనలను రక్షించుటను గూర్చి ప్రకటించండి. 3దేవుడు నిజంగా ఆశ్చర్యకరుడని ఇతర ప్రజలతో చెప్పండి. దేవుడు చేసే అద్భుత కార్యాలను గూర్చి అన్నిచోట్లా ప్రజలకు చెప్పండి. 4యెహోవా గొప్పవాడు, స్తుతికి పాత్రుడు. ఇతర “దేవుళ్లు” అందరికంటె ఆయన భీకరుడు. 5ఇతర జనాల “దేవుళ్లంతా” కేవలం విగ్రహాలే. కానీ యెహోవా ఆకాశాలను సృష్టించాడు. 6ఆయన యెదుట అందమైన మహిమ ప్రకాశిస్తూ ఉంటుంది. దేవుని పవిత్ర ఆలయంలో బలం, సౌందర్యం ఉన్నాయి. 7వంశములారా రాజ్యములారా యెహోవా మహిమకు, స్తుతి కీర్తనలు పాడండి. 8యెహోవా నామాన్ని స్తుతించండి. మీ కానుకలు తీసుకొని ఆలయానికి వెళ్లండి. 9యెహోవా అందమైన ఆలయంలో ఆయనను ఆరాధించండి! భూమి మీద ప్రతి మనిషి ఆయన ముందు వణకాలి. 10యెహోవా రాజు అని జనాలకు ప్రకటించండి! కనుక ప్రపంచం నాశనం చేయబడదు. యెహోవా తన ప్రజలను న్యాయంగా పరిపాలిస్తాడు. 11ఆకాశములారా సంతోషించండి! భూమీ, ఆనందించుము! సముద్రమా, అందులోని సమస్తమా, సంతోషంతో ఘోషించుము! 12పొలాల్లారా, వాటిలో పండే సమస్తమా సంతోషించండి! అరణ్యంలో వృక్షాల్లారా, పాడుతూ సంతోషించండి. 13యెహోవా వస్తున్నాడు గనుక సంతోషంగా ఉండండి. ప్రపంచాన్ని పాలించుటకు యెహోవా వస్తున్నాడు. న్యాయంగా, ధర్మంగా ఆయన ప్రపంచాన్ని పాలిస్తాడు.


Copyrighted Material
Learn More

will be added

X\