పరమ గీతము 8

1తల్లి పాలు కుడిచేనాచిన్నారి తమ్ముడిలా నువ్వు చిట్టి పాపవే అయితే, నువ్వు నాకు బయట అగుపిస్తే, నిన్ను నేను ముద్దాడగలిగి ఉండేదాన్ని. అప్పుడు నన్నెవరూ తప్పు పట్టేవారు కారు! 2నేను నిన్ను నాకు అన్నీ నేర్పిన మా తల్లి ఇంటి గదిలోనికి తీసుకుపోయి ఉండేదాన్ని. దానిమ్మ పళ్లరసంతో చేసిన సురభిళ మధువును నీకు ఇచ్చి ఉండేదాన్ని. 3అతను తన ఎడమ చేతిని నా తల కింద ఉంచి తన కుడిచేతితో పొదివి పట్టుకుంటాడు. 4యెరూషలేము స్త్రీలారా మీరు నాకొక వాగ్దానం చేయండి నా ప్రేమ స్వయం ప్రేరితమయ్యేదాకా, ప్రేమను జాగృతం చేయకండి ప్రేమను పురిగొల్పకండి. 5ఎడారి వెంట, తన ప్రియుని ఆనుకొని వస్తున్న ఈ స్త్రీ ఎవరు? ఆపిలు చెట్టు నీడలో నిన్ను తట్టి నే లేపాను. అచ్చటే నీ తల్లి తన గర్భాన నిన్ను మోసింది, కన్నది. 6నీ హృదయ పీఠం మీద నా రూపం ముద్రించు, నీ వేలికి ముద్రికలా ధరించు. మృత్యువంత బలమైనది ప్రేమ కోపాతిరేకం స్మశాననంతో సమమైనది. రోష విస్ఫులింగాలు జ్వాల అవుతాయి జ్వాలలు పెచ్చు మీరి మహాజ్వాల అవుతాయి. 7ఉప్పెన కూడా ప్రేమజ్వాలను ఆర్పజాలదునది జలాలూ ప్రేమను ముంచెత్తజాలవు. ఒకడు ప్రేమ కోసం తన సర్వస్వం ధరపోస్తే, అతణ్ణి ప్రజలు మూర్ఖుడిగా పరిగణించరు. ఎవడూ తప్పు పట్ట జాలడు! 8మాకు ఉన్నదొక చిన్న చెల్లెలు ఆమెకింకా యుక్త వయస్సు రాలేదు. దాన్ని వివాహం చేసుకొనుటకు ఒక పురుషుడు వస్తే, మా చెల్లెలి విషయంలో మేమేమి చెయ్యాలి? 9అది ప్రాకారమైతే, దాని చుట్టూ వెండి నగిషీ చేస్తాము అది తలుపైతే, దాని చుట్టూ దేవదారు పలకలతో అంచులు అలంకరిస్తాము. 10నేను ప్రాకారం వంటిదాన్ని నా వక్షోజాలు గోపుర ప్రాయాలు అతనికి నేనంటే తనివి, తృప్తి! 11బయలు హామోనులో సొలొమోనుకొక ద్రాక్షాతోట ఉంది. ఆ తోటనాతడు కొందరు రైతులకు కౌలుకిచ్చాడు. వారిలో ఒక్కొక్క రైతు వెయ్యి వెండి షెకెళ్లు ఇచ్చాడు. 12సొలొమోనూ, ఆ వెయ్యి షెకెళ్లూ నీ వే ఉంచుకో, వాటిలో యిన్నూరేసి ఒక్కొక్క రైతుకిచ్చేసెయ్యి అతుడు తెచ్చిన ద్రాక్షాలకు మింజువలె కానైతే, నా ద్రాక్షాతోట నా ఒద్దికలోనే ఉంటుంది! 13ద్రాక్షాతోటలో కూర్చున్న ఓ సఖీ, నీ చెలికత్తెలు నీ స్వరం వింటున్నారు, నీ మధుర స్వరాన్ని నన్నూ విననీయి. 14ప్రియ సఖా, వేగిరం వచ్చెయ్యి. జింకలూ, లేడి పిల్లల్లా పరిమళ వృక్ష సముదాయం పెరిగిన పర్వతాలపై నుంచి చెంగుచెంగున వచ్చెయ్యి.


Copyrighted Material
Learn More

will be added

X\